అమరావతి – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత నేడు సమావేశమయ్యారు . ఇటివల పవన్ సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు – పోలీసుల రియాక్షన్‌పై పవన్ ఇటీవల అసహనం వ్యక్తం చేశారు. ఇలా పోలీసులు నిర్లక్ష్యంతో వ్యవరిస్తే . తాను హోంమంత్రి అవుతానని అన్నారు..తాను ఆ పదవి చేపడితే రాష్ట్రంలో పరిస్థితులు వేరేగా ఉంటాయని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే నేడు రాష్ట్ర సచివాలయంలో పవన్ ను నేడు అనిత కలిశారు.
ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు , హోంశాఖ తీసుకుంటున్న చర్యలను పవన్ కు హోమ్ మినిస్టర్ వివరించారు.. దీని్కి స్పందించిన పవన్ కల్యాణ్ చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని అనితను కోరారు. ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. జన సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రతిక్షణం పరిశ్రమించే ప్రజా ప్రభుత్వంగా కూటమిని ముందుకు తీసుకెళ్లాలని హోమ్ మంత్రికి చెప్పారు పవన్ ..