ఏపీ రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన నిరసన నిన్నటికి 635వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ నాయకుడు కుమారస్వామి మాట్లాడుతూ.. అమరావతి రైతులు, మహిళల దీక్షకు బలరాముడే ఆదర్శమని అన్నారు. ఎప్పటికైనా ధర్మానిదే విజయమని మహాభారత యుద్ధ సమయంలో బలరాముడు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన చూపిన మార్గంలోనే రైతులు ముందుకు వెళుతున్నారని అన్నారు. విజయం చివరికి వారికే సిద్ధిస్తుందన్నారు. పార్టీలు, ప్రాంతాలు, కులమతాలను పక్కనపెట్టి అమరావతి కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఆదివారం బలరాముడి జయంతిని పురస్కరించుకుని తుళ్లూరులో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు.
ఇది కూడా చదవండి: 3 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలిః కేంద్రానికి స్థాయీ సంఘం సిఫార్సు