అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ రైతుల చేస్తున్న మహాపాదయాత్ర 24వ రోజుకు చేరింది. ఈ రోజు నెల్లూరు జిల్లా సున్నపు బట్టీ నుంచి రాజుపాలెం వరకూ 14కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. రైతుల పాదయాత్రకు గ్రామాల్లో ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది.
కాగా, నిన్న బోగోలు మండలం కొండ బిట్రగుంట నుంచి దగదర్తి మండలం సున్నంబట్టి వరకు సుమారు 15కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. దారి వెంట స్థానికులు మంచినీరు, మజ్జిగ ఇస్తూ.. రైతులకు సంఘీభావం తెలిపారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సిద్ధమవుతామని అమరావతి పరిరక్షణ ఐక్య వేదిక ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..