అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర షెడ్యూల్ లో స్వల్పమార్పు చోటుచేసుకుంది. ఇవాళ్టి పాదయాత్రకు విరామం ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం యాత్ర శనివారం యరజర్ల గ్రామం నుంచి ప్రారంభమై నిడమాలూరు వరకూ సాగి అక్కడ రాత్రికి బస చేయాల్సి ఉంది. అయితే, నిడమాలూరు పంచాయతీలోని 12వ వార్డుకు ఆదివారం ఎన్నిక జరగనుంది. దీంతో బయటి వ్యక్తులు ఆ గ్రామంలో అనుమతి లేదు. ఈ నేపథ్యంలో శనివారం జేఏసీ నేతలు యాత్రకు విరామం ప్రకటించారు. ఆదివారం నుంచి యథావిధిగా పాదయాత్ర కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.
కాగా, మహాపాదయాత్ర 12వ రోజైన శుక్రవారం ప్రకాశం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగింది. రైతులకు.. ప్రజలు అడుగడుగునా పూలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలన్న రైతుల డిమాండ్‌కు ప్రకాశం జిల్లా ప్రజలు మద్దతు పలికారు. సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఇప్పటి వరకు జరిగిన పాదయాత్ర 152.9 కిలోమీటర్ల మేర సాగింది.
ఇది కూడా చదవండి: తిరుపతి పర్యటనకు ఏపీ సీఎం జగన్
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily