Sunday, November 3, 2024

AP: అమ‌రావ‌తి రైతుల దీక్ష విర‌మ‌ణ‌..

రాజ‌ధాని ప‌రిర‌క్ష‌ణ కోసం 1631 రోజులు సాగిన ఆందోళ‌న‌లు
చంద్ర‌బాబు సీఎంగా ప్ర‌మాణ స్వీకారం
ఆ వెనువెంట‌నే దీక్ష శిబిరాలు ఎత్తివేసిన రైతులు
జోరుగా అమ‌రావ‌తిలో ప‌నులు

నాలుగున్నరేళ్ల తర్వాత అమరావతి రైతులు దీక్షను విరమించారు. అంతేకాదు దీక్షా శిబిరాలను కూడా ఎత్తివేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని కోసం భూమిని ఇచ్చిన రైతులకు అమరావతిపై ఆశలు చిరుగురించాయి. దానికి తోడు.. అమరావతే ఏపీకి ఏకైక రాజధానిగా ఉంటుందని చంద్రబాబు ప్రకటించడం.. నిన్న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో రైతులు దీక్షను విరమించారు.

2014లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత అమరావతి రైతులు రాజధాని కోసం 33వేల ఎకరాల భూమిని ఇచ్చారు. అక్కడ నిర్మాణాలు, పనులు వేగవంతం అవుతున్న సమయంలో రాష్ట్రంలో అధికారం చేతులు మారింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. దీంతో.. అమరావతికి భూమి ఇచ్చిన రైతులు ఆందోళనలు, నిరసనల బాట పట్టారు. మళ్లీ ప్రభుత్వం మారే వరకూ ఓ వైపు న్యాయపోరాటం చేస్తూనే.. మరోవైపు దీక్షలు చేశారు. రైతులు కోరుకున్నట్టు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. అమరావతే రాజధానిగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇవ్వడంతో దీక్షను విరమించారు.

- Advertisement -

సీట్ క్యాపిట‌ల్ లో జోరుగా ప‌నులు…
ఇప్పటికే అమరావతిలో పనులు వేగవంతం అయ్యాయి. రాజధానిలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు పూర్తి అయ్యాయి. వందకు పైగా జేసీబీ యంత్రాలు కంప, పిచ్చి చెట్లను తొలగించాయి. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 217 చదరపు కిలోమీటర్ల రాజధాని అమరావతిలో 32 పెద్ద రోడ్‌లను నిర్మాణం చేయటానికి ప్లాన్ రెడీ అయింది. ప్రధాన రోడ్ల నిర్మాణం పూర్తి చేసి రైతుల ప్లాట్లలో అభివృద్ధి పనులు చేసేందుకు సీఆర్డీఏ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే స్ట్రీట్‌ లైట్లతో రాజధానిలో కొత్త వెలుగులు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement