అమరావతి: రాజధాని అమరావతి ఉద్యమానికి 750 రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా “ఆగిన అమరావతి నిర్మాణం – అభివృద్ధిలో వెనుకబడిన ఆంధ్ర రాష్ట్రం” అంశంపై అమరావతి రాజధాని ఐక్యకార్యాచరణ సమితి (జెఏసి) ఆధ్వర్యంలో తుళ్ళూరు, మందడం, వెలగపూడి, పెదపెరిమి, కృష్ణాయపాలెం కేంద్రాలలో ప్రజా చైతన్య సదస్సులు నిర్వహించారు. అమరావతి రాజధాని పరిధిలోని 29 గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు ఉద్యమ ఉత్తేజంతో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. “జై అమరావతి – జైజై ఆంధ్రప్రదేశ్”, “19 గ్రామాలతో మున్సిపల్ కార్పోరేషన్ వద్దే వద్దు – 29 గ్రామాలతో కూడిన కార్పోరేషన్ కావాలి” తదితర నినాదాలు సదస్సు ప్రాంగణాల్లో మారుమ్రోగాయి. అమరావతి రాజధాని ఐక్యకార్యాచరణ సమితి, కన్వీనర్ పువ్వాడ సుధాకరరావు అధ్యక్షతన జరిగిన ఐదు సదస్సుల్లో ప్రధాన వక్తగా ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్ టి.లక్ష్మీనారాయణ పాల్గొని ప్రసంగించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital