Tuesday, November 26, 2024

Amaravati – నేడు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీతో చంద్ర బాబు సమావేశం

అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నేడు జరగనుంది.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం కానుంది రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ..

ఈ సమావేశంలో.. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై కీలకంగా చర్చ సాగనుంది.. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాల పైనా ఎస్ఎల్బీసీలో చర్చించే అవకాశం ఉందంటున్నారు.. ఎన్నికల ప్రచార సమయంలో.. ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం.. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్‌ అందజేసింది.. ఇక, మిగతా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేయడంపై దృష్టి సారిస్తున్నారు చంద్రబాబు ..

- Advertisement -

మరోవైపు.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈనెల 22వ తేదీ లేదా… ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని యోచిస్తోంది. అయితే… ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడం కష్టమని ఆర్థిక శాఖ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తెచ్చే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. మరో నాలుగు నెలల పాటు ఓటాన్ అకౌంట్ కోసం ఆర్డినెన్స్ తేవాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఆర్థిక వెసులుబాటు.. వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై క్లారిటీ రావడానికి మరో రెండు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తోంది. ఏపీ ఆర్ధిక పరిస్థితిపై క్లారిటీ వస్తే… సెప్టెంబరులో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టొచ్చని ఆర్థిక శాఖ అంచనా. ఆర్డినెన్స్ పెట్టాలనే ప్రతిపాదనకు…. ప్రభుత్వ పెద్దల ఆమోదం కోసం ఎదురుచూస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement