Friday, November 22, 2024

Amaravathi – ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ‌తీశారు – సీఎం చంద్ర‌బాబు ఆగ్ర‌హం

రాజధాని అమ‌రావ‌తి శంకుస్థాపన స్థలంలో సాష్టాంగ నమస్కారం
శిథిల ప్రజావేదికలో భావోద్వేగం
90 శాతం నిర్మిత భవన ప్రాంతాల‌న్నీ నిర్వేదం
అయిదేళ్లల్లో అంతా విధ్వంసం చేశారు
మూడు రాజధానుల పేరిట నిర్లక్ష్యం చేశారు
అమరావతి మహిళలు, రైతులతో సీఎం ముచ్చట్లు

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: తన మానస పుత్రిక రాజధాని అమరావతి స్థితి గతిని కళ్లార వీక్షించుందుకు ఏపీ సీఎం చంద్రబాబు గురువారం అమరావతిలోపర్యటించారు. ఉండవల్లి నుంచి తన పర్యటనను ప్రారంభించారు. గత ప్రభుత్వం కూల్చేసిన ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు. ఆ త‌ర్వాత‌ ఉద్దండరాయుని పాలెంలోని రాజధాని భూమి పూజ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ మోకాళ్లపై సాష్టాంగ నమస్కారం చేశారు. అక్కడి నుంచి హోమం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం భావోద్వేగానికి గురయ్యారు. మహిళా రైతులు ఏర్పాటు చేసిన పూజలో పాల్గొన‌గా, హారతులతో ఘనస్వాగతం ల‌భించింది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు ఫౌండేషన్ స్టోన్‌కు కొబ్బరి కాయ కొట్టారు. ఆ తర్వాత అమరావతి నమూనాను పరిశీలించారు. రైతులతో కాసేపు ముచ్చటించారు. రాజధాని నిర్మాణాలను పరిశీలించారు. సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాన్ని పరిశీలించారు.

- Advertisement -

ఐకానిక్ నిర్మాణాల ప్రాంతాల ప‌రిశీలన‌..

ఐకానిక్ నిర్మాణాల కోసం గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలనూ పరిశీలించారు. కాగా, వైసీపీ హయాంలో 3 రాజధానుల పేరుతో ఈ ప్రాంతంలో నిర్మాణాలు ఆగిపోయాయి. ఈ క్రమంలో వీటిని పరిశీలించి ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయనున్నారు. కాగా, సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం రాజధాని అమరావతిని సందర్శించారు. అటు, సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టక ముందు నుంచే అధికారులు ఇక్కడ పనులు చేపట్టారు.పోలవరం తర్వాత అమరావతిపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే రాజధాని ప్రాంతాన్ని సందర్శించారు. ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన విధ్యంసాన్ని సీఎం స్వయంగా పరిశీలించారు. ముందుగా.. కూల్చిన ప్రజావేదిక ప్రాంగణాన్ని వీక్షించారు.

మారుమోగిన నినాదాలు..

ఆ ప్రాంతానికి సీఎం చంద్ర‌బాబు రాగానే.. జై చంద్రబాబు, జై అమరావతి నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. జగన్ ప్రభుత్వ విధ్యంస పాలనకు సాక్షిగా ఈ శిథిలాలను అలాగే ఉంచుతామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు.ప్రజాప్రతినిధులు, అధికారుల నివాస భవనాల నిర్మాణాలను పరిశీలించారు. 2019లోనే ఈ భవనాల నిర్మాణం 70 నుంచి 90 శాతం పనులు పూర్తి అయ్యాయి. ఆ తర్వాత జగన్‌ ప్రభుత్వం రాగానే.. అమరావతి అటకెక్కింది. నిర్మాణ పనులను నిలిపివేశారు. మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్లక్ష్యం చేశారని సీఎం చంద్రబాబు స్థానికులతో అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement