టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌వి అనైతికమైన పొత్తులు అని దుయ్యబట్టారు మంత్రి అంబటి రాంబాబు. మాచర్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలు జనసేన ఎవరితో పొత్తు లో ఉంది బీజేపీతోనా, టీడీపీతోనా? అని నిలదీశారు.
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నరసరావుపేట ఎంపీ స్థానాన్ని బీసీకి కేటాయించారని.. సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీ కృష్ణ దేవరాయలు పార్టీ విడిచి వెళ్లిపోయారని మండిపడ్డారు.. బీసీలకు సీటు ఇస్తే తట్టుకోలేక ఇంకో పార్టీలోకి వెళ్తున్న లావు ఒక బీసీ ద్రోహిగా ఫైర్ అయ్యారు.. వచ్చే ఎన్నికల కోసం పార్టీ అసంతృప్తులు సరి చేసుకొని ముందుకు వెళ్తామని తెలిపారు. ఇక, ఏపీ రాజధానిపై మాట్లాడుతూ, .. ప్రస్తుతానికి ఏపీకి రాజధాని అమరావతే అని స్పష్టం చేశారు..ఎపికి అసలు రాజధాని లేదంటూ తెలుగుదేశం పార్టీకి ఆయన ధీటుగా సమాదానం ఇస్తూ, అమరావతి తాము ఎక్కడికి తరలించలేదని, అది ఎపికి రాజదానిగా ఇప్పటికీ కొనసాగుతున్నదని చెప్పారు.. రాజదానిపై కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు