అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా గత కొద్దినెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ అహ్సదుద్దీన్ అమానుల్లా పాట్నా కోర్టుకు బదిలీ అయ్యారు. బీహార్‌కు చెందిన ఆయన 1991లో బీహార్ బార్ కౌన్సిల్ సభ్యులుగా నమోదయ్యారు.
అనంతరం 2011 జూన్ 20వ తేదీన పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి సాధించారు. గత ఏడాది సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సుల్లో భాగంగా రాష్ట్ర హైకోర్టుకు బదిలీ అయ్యారు. దీంతో ఏపీ హైకోర్టులో ప్రస్తుతం ఇద్దరు న్యాయమూర్తుల పదవులు ఖాళీ అయ్యాయి.
జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి పదవీ విరమణ కాగా అమానుల్లా పాట్నా కోర్టుకు బదిలీ అయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నేతృత్వంలో ఫుల్ కోర్టు గురువారం జస్టిస్ అమానుల్లాకు వీడ్కోలు పలకనుంది.