అమలాపురం: ఇళ్లలో మన అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉంటే.. మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికం పరంగా, విద్యా, మహిళా రక్షణ కోసం చేయగలిగే ప్రతీ పని కూడా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మీ బిడ్డ అక్కచెల్లెమ్మల కోసం మహిళా పక్షపాత ప్రభుత్వంగానే అడుగులు ముందుకు వేశాడని సగర్వంగా తెలియజేస్తున్నా’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం మండలం జనుపల్లిలో వరుసగా నాల్గవ ఏడాది వైయస్ఆర్ సున్నావడ్డీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 1,05,13,365 మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో సున్నావడ్డీ నగదు రూ.1,354 కోట్లను జమ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో జగన్ మాట్లాడుతూ, 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంటా సాధికారతతో ఆవిర్భవించాలని బలంగా నమ్మిన ప్రభుత్వంగా అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు సున్నావడ్డీ పథకం ద్వారా ఈ నాలుగేళ్లలో రూ.4,969 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు.
ఈ సభలో టిడిపి అధినేత చంద్రబాబుపై జగన్ విరుచుకుపడ్డారు.. చంద్రబాబుది నారీ వ్యతిరేక చరిత్ర అని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబు ఆనాడు మహిళలను హామీ ఇచ్చారన్నారు. రుణాలు మాఫీ చేయకుండా డ్వాక్రా మహిళను చంద్రబాబు రోడ్డుపై నిలబెట్టారని ఆయన విమర్శించారు. చంద్రబాబు అరాచకాలను తలుచుకుంటే బాధనిపిస్తుందన్నారు. 2016లోనే చంద్రబాబు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారన్నారు. అది వారి చరిత్ర, అది నారా వారి చరిత్ర, అది నారీ వ్యతిరేక చరిత్ర అంటూ చంద్రబాబు పాలన తీరును సీఎం జగన్ ఎండగట్టారు. మహిళలు సంతోషంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుందని సీఎం జగన్ చెప్పారు. అందుకే సున్నా వడ్డీ పథకాన్ని పునరుద్దరించినట్టుగా సీఎం జగన్ వివరించారు. ఈ కారణంగా తమ ప్రభుత్వంపై పెనుభారం పడిందని ఆయన గుర్తు చేశారు.
తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని సీఎం జగన్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ బీసీ నేస్తం, వైఎస్ఆర్ ఆసరా లాంటి పథకాలను అమలు చేస్తూ పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నామన్నారు. దేశ చరిత్రలో ఇలాంటి పథకం ఎక్కడా లేదని ఆయన గుర్తు చేశారు. సున్నా వడ్డీ పథకం కింద మూడు విడతల్లో రూ. 19 వేల కోట్లను లబ్దిదారులకు అందించినట్టుగా సీఎం జగన్ చెప్పారు. కోటి 5 లక్షల మంది మహిళలకు సున్నా వడ్డీ నిధులు అందిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సీఎం జగన్ చెప్పారు.
పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామన్నారు.గతంలో ఏ ప్రభుత్వం కూడ ఈ స్థాయిలో ఇళ్ల పట్టాలు ఇవ్వని విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు.ఇళ్ల స్థలాలతో పాటు 22 లక్షల ఇళ్లు కూడ కట్టిస్తున్నామన్నారు సీఎం. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకు రూ. 6 వేల 141 కోట్లు ఖర్చు చేసినట్టుగా సీఎం వివరించారు.గా నిలుస్తున్నదని చెప్పారు.