జీవితంలో ఉన్నత శికరాలను అధిరోంచాలంటే చదువుతోపాటు జీవితానుభవం కూడా ఎంతో ముఖ్యమని చట్టం ముందు అందరు సమానులేనని జిల్లా ప్రధాన న్యాయమూరర్తి శివరామకృష్ణ అన్నారు. పాన్ ఇండియా అవేర్‌నెస్ అండు అవుట్‌రీచ్ క్యాంపైన్ ముగింపు సందర్భంగా ఆదివారం డిఎల్ ఎన్ వద్ద నుండి జిల్లా కోర్టు సెంటరు వరకు నిర్వహించిన ర్యాలీలో న్యాయయమూర్తులు, పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.
అనంతరం న్యాయసేవా దనలో పాన్ ఇండియా అవేర్‌నెస్ అండు అవుట్‌రీచ్ క్యాంపైన్ ముగింపు సమావేశంతో పాటు బాలల దీనోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారండిఎన్ ఎస్ ఎల్ నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అట్టడుగున ఉన్నవారి దైనందిన జీవితంలో చట్టపరంగా ఎదురయ్యే సమస్యలనుండి ఎలా పరిష్కారం పొందాలి పేదరికం అడ్డంకి కాకుండా వారికి న్యాయ స్థానాల ద్వారా న్యాయపరమైన హక్కులు సాధించుటకు తగిన అవగాహన కల్పించటంతోపాటు వివిధ చట్టాలు న్యాయపరమైన అంశాలపై అక్టోబర్ 2 నుండి నేటి వరకు ఎన్నో అవగాహన కార్యక్రమాలు డిఎన్ ఎల్ ఏ ద్వారా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయ వాదులు, పారాలీగల్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.