ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆపీసులో అధికారులకు శాఖలు కేటాయిస్తూ స్పెషల్ సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి ఇవ్వాల (శుక్రవారం) ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డికి జీఏడీ, హోం, రెవెన్యూ, అటవీ పర్యావరణ, వైద్య ఆరోగ్య, శాసనసభ వ్యవహారాలు, పరిశ్రమ, పెట్టుబడులు, మౌలిక వసతులు, కేంద్ర ప్రభుత్వ అంశాలు, సీఎంవో ఎస్టాబ్లిష్ మెంట్ అండ్ రెసిడ్యువల్ సబ్జెక్టులు కేటాయించారు.
సీఎం కార్యదర్శి సాల్మన్ రాజ్‌కు పౌరసరఫరాలు, విద్యా, పంచాయతీరాజ్, గ్రామీణాభివ్రుద్ధి, గనులు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, అన్ని సంక్షేమ శాఖలు కేటాయించారు. సీఎం కార్యదర్శి ధనుంజయ్ రెడ్డికి ఆర్థిక, ప్రణాళిక, ఇరిగేషన్, వ్యవసాయ, అనుబంధ రంగాలు, మున్సిపల్ పరిపాలన, ఇంధన, పర్యాటక, యువజన సర్వీసులు, మార్కెటింగ్ అండ్ సహకార శాఖలు కేటాయించారు. ఇక.. సీఎం అడిషనల్ సెక్రెటరీ ముత్యాలరాజుకు ప్రజా ప్రతినిధుల వినతులు, రెవెన్యూ (ల్యాండ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్),హౌసింగ్, రవాణా, రోడ్లు, భవనాలు, కార్మిక, స్కిల్ డెవలప్ మెంట్ శాఖలు కేటాయిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.