Monday, June 24, 2024

AP | సచివాలయంలో మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు..

ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. నాలుగో సారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు.. 24 మందితో మంత్రి మండలిని ఏర్పాటు చేశారు. నూతన మంత్రులకు ఇటీవల శాఖలు కూడా కేటాయించారు. ఈ క్రమంలో కొత్త మినిస్టర్లకు తాజాగా రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వం ఛాంబర్లు కేటాయించింది. డిప్యూటీ సీఎం పవన్ కు రెండో బ్లాక్‌లోని ఛాంబర్ నెంబర్ 211 కేటాయించారు.

పవన్‌తో పాటు రెండో బ్లాక్‌లో మంత్రులు నాదెండ్ల మనోహర్, నారాయణ, అనిత, కందుల దుర్గేష్,పయ్యావుల కేశవ్, ఆనం నారాయణ రెడ్డి ఛాంబర్లు కేటాయించారు. బ్లాక్-3లో గొట్టిపాటి, కొల్లు , సంధ్యారాణి, డోలా, ఫరూక్‌లకు ఛాంబర్లు ఇచ్చారు. అచ్చెన్న, సవిత, టీజీ భరత్,నారా లోకేష్, అనగాని, రాంప్రసాద్ రెడ్డి, కొలుసు, నిమ్మల ఐదో బ్లాక్‌లో ఛాంబర్లు కేటాయించారు. బ్లాక్-5లో బీసీ జనార్ధన్ రెడ్డి, వాసంశెట్టి,కొండపల్లి, సత్యకుమార్లకు ఛాంబర్లు కేటాయించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement