ఎన్నికలు ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నాయని, ప్రజల సంక్షేమం కోసం మాత్రమే జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంటుందని అధికారం కోసం కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆదివారం కర్నూలు జిల్ఆ సిరివెళ్ల రచ్చబండ కార్యక్రమంలో భాగంగా గోవిందపల్లె వద్ద విలేకరుల సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఇన్ని సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం వేడుక చూసిందని పవన్ విమర్శించారు . జనసేన పార్టీ తరఫున కౌలు రైతులకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేస్తేంటే దౌర్జన్యంతో వారిని భయపెట్టడం ప్రజలు గమనిస్తూ నట్లు చెప్పారు.
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందజేయడం వైసీపీ ప్రభుత్వానికి గిట్టడం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. అమ్మ పెట్టదు, ఎవరినీ అడగనివ్వదు అని సామెత గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలు అంతులేకుండా పోయిందన్నారు. వారికి బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైందన్నారు. బిజెపితో జనసేన పొత్తు బలంగా ఉందని ఎన్నికల సమయంలో మిగతా పార్టీలతో పొత్తు గురించి ఆలోచన చేస్తామని అన్నారు. ఎన్నికల సమయానికి అటువంటి అద్భుతం జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.