Sunday, November 24, 2024

AP | కూటమి నేతలు సమన్వయంతో పనిచేయాలి : మంత్రి నిమ్మ‌ల

కర్నూలు బ్యూరో : జనరల్ ఎలక్షన్స్ లో కూటమి 93శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచిందని, ఇంక ముందు జరిగే అన్ని ఎన్నికల్లోనూ 93శాతం స్ట్రైక్ రేట్ దాటేలా కూటమి నేతలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి నిమ్మ‌ల రామానాయుడు అన్నారు. జిల్లా ఇంచార్జి మంత్రిగా క‌ర్నూలు జిల్లా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయ‌కుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… సాగునీటి సంఘాలు, కో ఆప‌రేటివ్ సొసైటీ చైర్మ‌న్ల ఎన్నిక‌ల్లో గెలుపుదిశ‌గా కూటిమి నేత‌లు ప‌నిచేయాలన్నారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌ను వెంట‌నే పూర్తి చేస్తామన్నారు. రాయ‌ల‌సీమ వ‌ర‌ప్ర‌దాయ‌ని హంద్రీనీవా ప్రాజెక్టు సామ‌ర్ద్యం పెంచేలా ఈనెల‌లో ప‌నులు పునఃప్రారంభిస్తామన్నారు.

వ‌ల‌స‌ల‌ను అరిక‌ట్టేందుకు చ‌ర్య‌లు చేప‌డ‌తామన్నారు. సీజ‌న‌ల్ హాస్ట‌ల్స్ ను ప్రారంభించేలా మంత్రి నారాలోకేష్, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. వెంటిలేటర్ పై ఉన్న వైసీపీ అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కూటమి నేతల మధ్య వివాదాలు అంటూ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారన్నారు. ఉచిత ఇసుకను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఉన్న 8లక్షల ఎకరాల్లో 20శాతానికి కూడా సాగు నీరందడం లేదన్నారు. ఎవరేమనుకున్నా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మరో 30ఏళ్లు ఉంటుందన్నారు. దానికి తగ్గట్టుగా నాయకులు సిద్ధమై పని చేయాలన్నారు. నాయకులను వదులుకుంటాం కానీ 3పార్టీల పొత్తు మాత్రం వదులుకోమని గుర్తించాలన్నారు.

హంద్రీనీవా ప్రాజెక్టులో 2014-19 లో చేసిన పనులు తప్ప, వైసీపీ పాలనలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదన్నారు. రాజధాని అమరావతి నుండి కర్నూలు రావడానికి ఒక్క ట్రైన్ సదుపాయం కూడా లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో యురేనియం నిక్షేపాల సర్వేకు అనుమతులిచ్చి, ఇప్పుడు వైసీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారన్నారు. యురేనియం సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, టమాటా, ఉల్లి రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూల్ లో డ్రోన్ హబ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement