Sunday, November 17, 2024

Allagadda – అపశృతులు …. ఒక‌రు డ్యాన్స్ వేస్తూ ,మ‌రొక‌రు నిమ‌జ్జ‌నాని వెళ్లి..

నంద్యాల – నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ పట్టణంలో గణేష్ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. స్థానిక ఆశ్రమంవీథి లోని గంగమ్మ దేవాలయం వద్ద అశోక్ (32) అనే యువకుడు డాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. ప్రభుత్వ
ఆసుపత్రికి తీసుకెళ్లగా హార్ట్ ఎటాక్ తో అశోక్ చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. దీనితో ఆశ్రమం వీధిలో విషాద ఛాయలు అలముకున్నాయి.

అహోబిలం తెలుగు కాలవలో బాలుడు గల్లంతు

ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో సోమవారం జరిగిన వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లాలు భాష (12) తెలుగు గంగ ప్రాజెక్టు నీటిలో పడి కొట్టుకొని పోయాడు. గ్రామానికి చెందిన నలుగురు పిల్లలు వినాయకుని నిమజ్జనం వెంట వెళ్లగా నిమజ్జనం జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు బాలుడు నీటిలో కొట్టుకొని పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

అహోబిలంలోని టోల్ గేటు సిబ్బంది నీటిలో కొట్టుకొని పోతున్న ముగ్గురు పిల్లలను రక్షించగా.. లాలు భాష అనే బాలుడు మాత్రం నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆళ్లగడ్డ రూరల్ ఎస్సై హరి ప్రసాద్, సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాలుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement