Saturday, September 14, 2024

AP: శ్రీశైలం అన్ని గేట్లు మూసివేత… చేపల వేటకు వచ్చిన మత్స్యకారులు…

నంద్యాల బ్యూరో, ఆగస్టు 13 (ప్రభ న్యూస్) : శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం గేట్లన్నీ మూసివేయడంతో ఒక్కసారిగా మత్స్యకారులు చేపలు పట్టేందుకు పడవల తో ప్రాజెక్టు లోపలికి రావటంతో సందర్శకులు ఆహ్లాదకరంగా చూడటం కనిపించింది.

మత్స్యకారులు చిన్న చిన్న పడవలు వేసుకొని నదిపై గుంపులు గుంపులుగా చేపల వేటకు వస్తున్న వారిని చూసి యాత్రికులు మంత్రముగ్ధులవుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా వరద ప్రవాహం రావడంతో జలాశయం గేట్లు ఎత్తి నీటిని కిందకి వదిలిన అధికారులు జూరాల నారాయణపూర్ నుంచి వరద ప్రవాహం ఆగిపోవడంతో సోమవారం రాత్రికి గేట్లన్నీ పూర్తిగా బంద్ చేశారు.

గతంలో ప్రవాహం అధికంగా ఉండటంతో చేపల వేటకు వెళ్ళవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం గేట్లన్నీ మూసివేయడంతో ఒక్కసారిగా చేపల వేటకు బయలుదేరిన మత్స్యకారులు. గుంపులు గుంపులుగా పడవల్లో మత్స్యకారులు బయలుదేరి చేపలు భారీగా పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సందర్శకులు ఈ దృశ్యాన్ని చూసి పరవశించి పోతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement