అమరావతి: కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. అమరావతిలో నేడు నిర్వహిచిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ”కొన్ని లెక్కింపు కేంద్రాలకు స్వయంగా వెళ్లి ఏర్పాట్లు పరిశీలించాం. జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్, 8.30 నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈసారి పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా వచ్చాయి. వీటికి ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి. రాష్ట్రానికి 119 మంది అబ్జర్వర్లను ఈసీ నియమించింది. ప్రతి కౌంటింగ్ హాలులో కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు. ప్రతి సెంటర్‌లో మీడియా రూమ్ ఏర్పాటు చేశాం. లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నాం. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా భద్రతా బలగాలను మోహరిస్తున్నాం. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ఠ భద్రత ఉంది.” అని తెలిపారు.
All Set – కౌంటింగ్ కు సర్వం సిద్దం… ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా
Advertisement
తాజా వార్తలు
Advertisement