Friday, November 22, 2024

జి 20 స‌ద‌స్సుకి ముస్తాబ‌వుతున్న విశాఖ‌..

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో : ప్రపంచం లోనే అందమైన నగరంగా పేరుగాంచిన మహావిశాఖ ఇప్పుడు తన రూపురేఖలను మరింతగా మార్చుకొని, నూతన సొబగులకు వేదికగా మారింది. ఇటీవలే విశాఖ వేదికగా ప్రపంచ పెట్టుబడుల సదస్సును రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. తాజాగా ఇదే నెలలో 28, 29 తేదీలలో జీ-20 సమావేశాలు జరగనున్నాయి. దీంతో విశాఖ మరో సారి సర్వాంగ సుందరంగా ముస్తాబ వుతోంది. జిల్లా కలెక్టర్‌ ఏ.మల్లిఖార్జున పర్యవేక్షణలో గ్రేటర్‌ కమిషనర్‌ పి.రాజాబాబు ఆధ్వర్యంలో నగరం రూపురేఖలు మారిపోయే విధంగా జీవీఎంసీ పలు అభివృద్ధి పనులు చేపడుతోంది .

సుమారు రూ.120 కోట్లు ఆయా అభివృద్ధి నులకు సంబంధించి అన్ని విభాగాలకు కేటాయించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వపరంగా కొంత మేర నిధులు విడుదల చేశారు. ఈ నేపధ్యంలోనే నగరంలోని బీచ్‌రోడ్డులో నోవోటల్‌ హోటల్‌ నుంచి రా డిసన్‌ బ్లూ వరకు జిల్లా అధికార యంత్రాంగం అద్దం లా తీర్చిదిద్దుతుంది. మరో వైపు నగరమంతా ఇప్పటికే రహదారులు నూతనంగా నిర్మించారు. ఆపైన బీచ్‌ రోడ్డులో అందమైన బొమ్మలు వేసి మెరుగులు దిద్దు తున్నారు. ఇక ఏ ప్రాంతం చూసిన కళకళలాడె విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇక ముఖ్య కూడల్లలో సున్నాలు, రంగులు వేయడంతో పాటు అందమైన మొక్కలను ఏర్పాటు చేస్తున్నారు. బీచ్‌రోడ్డులో ప్రత్యేకంగా ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక నగరంలోని ముఖ్య కూడల్ల లో విద్యుత్‌ అలంకరణలు చేశారు. అందమైన బొమ్మలు ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న కృత్రిమ బొమ్మలకు మెరుగులు దిద్దుతున్నారు. పారిశుధ్యం సమస్య లేకుండా అన్ని ప్రాంతాలను చక్కదిద్దు తున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులు విశాఖలో పర్యటిం చి అవసరమైన మేరకు సలహాలు సూచనలు అంద జేస్తున్నారు. అయితే జీ-20 సమావేశాలకు వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు ఉమ్మడి విశాఖలో ఏ ప్రాంతంలో పర్యటించిన అక్కడ అందచందాలు కనువిందు చేసే విధంగా తీర్చిదిద్దు తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement