అమరావతి – ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలకు విశాఖపట్నం ఆథిత్యం ఇవ్వనుంది. అడిషనల్ డీజీపీ రాజీవ్ కుమార్ మీనా తెలిపారు. 14వ అల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్-2024 ఈ సారి విశాఖలో జరగనున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి 30వతేది వరకూ కొనసాగుతాయని చెప్పారు… ప్రారంబోత్సవ వేడుకలలో ముఖ్య అతిధిగా ఎపి హోం శాఖ మంత్రి తానేటి వనిత హాజరవుతారని చెప్పారు.. ముగింపు వేడుకలలో ఎపి డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు..
కాగా, 2008వ సంవత్సరం నుంచి ప్రతి ఏటా కొనసాగుతున్న ఈ పోటీలలో పలు రాష్ట్రాల నుంచి కేంద్ర పోలీసు బలగాలు పాల్గొనున్నాయి.. ప్రస్తుతం 14వ ఏఐపీసీసీ – 2024 కు ఆంధ్ర ప్రదేశ్ తరపున గ్రేహౌండ్స్ ఆతిథ్యం వహిస్తుంది అని తెలిపారు. 13వ ఆలిండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్ పోటీలు మనేసర్ లో జరిగింది.. 10వ ఏఐపీసీసీ-2018 పూణేలో నిర్వహించడం జరిగింది అని మీనా చెప్పారు. కోవిడ్ కారణంగా 11, 12వ ఏఐపీసీసీ రద్దు చేశారని తెలిపారు. ఇటీవల జరిగిన 13వ ఏఐపీసీసీ పోటీల్లో విజేతగా ఐటీబీపీ నిలిచిందన్నారు. ఏపీ గ్రేహౌండ్స్ జట్టు ఉత్తమ కాన్ఫిడెన్స్ కోర్స్ ట్రోఫిని.. 6వ ఏఐపీసీసీ పోటీలలో రన్నర్ ట్రోపీని గెలుచుకుంది అని చెప్పారు. ప్రస్తుతం 14వ ఏఐపీసీసీ- 2024 పోటీల్లో 23 జట్లు పాల్గొనున్నాయి.. 23 జట్టుల్లో 16 రాష్ట్రాల పోలీసులు జట్లు, 7 కేంద్ర పోలీసు సంస్థల జట్లు ఉన్నాయన్నారు.