Sunday, November 17, 2024

AP: బోగస్ ఓట్లన్నీ టీడీపీవే – విజయసాయి రెడ్డి

విజ‌య‌వాడ – జనసేన గుర్తింపులేని పార్టీ, గుర్తింపులేని జనసేన పార్టీని ఎలా అనుమతించారని వైసీపీ నేత విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు విజ‌య‌సాయిరెడ్డి, మార్గాని భ‌ర‌త్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని క‌లిసి ఆరు అంశాల‌పై ఫిర్యాదు చేశారు. ఆ స‌మావేశం ముగిసిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. జనసేన పార్టీ గుర్తు గ్లాస్‌ జనరల్‌ సింబల్ అని, మొత్తం ఆరు అంశాలపై సీఈసీకి ఫిర్యాదు చేశామని మీడియాతో విజయసాయి రెడ్డి వివరించారు.

మై పార్టీ డ్యాష్‌ బోర్డును విదేశాల నుంచి టీడీపీ నడిపిస్తోందని, ఇల్లీగల్‌ ఓటర్‌ ప్రొఫైల్‌ తయారు చేస్తున్న టీడీపీపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. పది లక్షలకు పైగా బోగస్ ఓట్లు నమోదు చేశారని కోనేరు సురేష్ ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశార‌ని, ఒక వ్యక్తికి బోగస్ ఓట్లు ఉన్నాయని ఎలా తెలుస్తుంది ? అని ప్ర‌శ్నించారు. బోగస్ ఓట్ల గురించి బీఎల్ఓస్ చెప్పాలి, కానీ ఒక వ్యక్తి ఎలా చెబుతున్నాడు‌ ? అని పేర్కొన్నారు.

ఆ ఫిర్యాదే బోగస్ అని, అత‌డిపై చర్యలు తీసుకోవాలని, టీడీపీ ఉద్ధేశ పూర్వకంగా వైఎస్సార్‌సీపీ ఓటర్లను టార్గెట్ చేస్తోందని అన్నారు. తెలంగాణ ఓటర్లు ఏపీలో కూడా ఓటర్లుగా ఉన్నారని, ఇలాంటి డూప్లికేట్ ఓట్లను తొలగించాలని కోరామని చెప్పారు. టీడీపీ నాయకుడు లోకేష్ రెడ్ బుక్‌ పేరిట అధికారులను బెదిరిస్తున్నారని, అధికారుల‌ పేర్లు నోట్ చేసుకుని, సర్వీస్ నుంచి లోకేష్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వివ‌రించారు. లోకేష్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇక ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఒకే రోజు ఎన్నికలు నిర్వహించాలని సీఈసీని కోరినట్టు విజయసాయి రెడ్డి తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement