Sunday, July 7, 2024

రైల్వే ప్రయాణికులకు అలర్ట్… పలు రైళ్లు రద్దు, కొన్ని సర్వీసులు రీషెడ్యూల్

రైల్వే ప్రయాణికులకు భారీ హెచ్చరిక… విజయవాడ, వాల్తేరు డివిజన్లలో రైల్వే పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేయగా… మరికొన్నింటిని రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ డివిజన్‌లో 30 రైళ్లను రద్దు చేయగా, శాంతిభద్రతల దృష్ట్యా వాల్తేరు డివిజన్‌లో 10 రైళ్లను రద్దు చేశారు. అలాగే 4 సర్వీసులను రీషెడ్యూల్ చేసినట్లు చేశారు.

వాల్తేరు డివిజన్‌ – రద్దైన రైళ్ల వివరాలు

  • ఈ నెల 5న (శుక్రవారం) పలాస – విశాఖ – పలాస ప్యాసింజర్ రైలు (07470/07471) , అలాగే విశాఖ – గుణుపూర్ – విశాఖ ప్యాసింజర్ (08522/08521) రైలు రద్దు చేశారు.
  • ఈ నెల 5న విశాఖ – బ్రహ్మపూర్ ప్యాసింజర్ (08532), ఈ నెల 6న బ్రహ్మపూర్ – విశాఖ ప్యాసింజర్ (08531) రైలు రద్దు. అలాగే, ఈ నెల 5న విశాఖ – భువనేశ్వర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (22820), భువనేశ్వర్ – విశాఖ ఇంటర్‌సిటీ (22819) రైలు రద్దు చేశారు.
  • ఈ నెల 6న భవానీపట్నం – విశాఖపట్నం ప్యాసింజర్ రైలు (08503) రైలు రద్దైంది.

విజయవాడ డివిజన్‌లో..

  • ఆగస్ట్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ విజయవాడ – భద్రాచలం (07979), భద్రాచలం – విజయవాడ (07278/07279) రైళ్లు రద్దు.
  • తెనాలి – విజయవాడ (07575), ఆగస్ట్ 3 నుంచి 10 వరకూ తెనాలి – విజయవాడ (07630), విజయవాడ – గుంటూరు (07464/07465).
  • గుంటూరు – సికింద్రాబాద్ (17201/17202) రైళ్లు రద్దయ్యాయి.
  • ఆగస్ట్ 5 నుంచి 10 వరకూ విజయవాడ – చెన్నై సెంట్రల్ (12711/12712) రైళ్లు రద్దు చేశారు.
  • ఆగస్ట్ 3 నుంచి 10 వరకూ విజయవాడ – గూడూరు (07500), ఆగస్ట్ 4 నుంచి 11 వరకూ గూడూరు – విజయవాడ (07458) రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి.
  • ఆగస్ట్ 5 నుంచి 12 వరకూ విజయవాడ – మాచర్ల (07781/07782), అలాగే విజయవాడ – తెనాలి (07629) రైళ్లు రద్దు.
  • ఆగస్ట్ 5 నుంచి 10 వరకూ విజయవాడ – గుంటూరు (07464/07465), అలాగే గుంటూరు – విజయవాడ (07755/07756), డోర్నకల్ – విజయవాడ (07755) రైలు రద్దు చేశారు.
  • ఆగస్ట్ 3 నుంచి 10వ తేదీ వరకూ నర్సాపూర్ – విజయవాడ (17270), విజయవాడ – బిట్రగుంట (07978) రైలు రద్దు.
  • ఆగస్ట్ 3 నుంచి 11 వరకూ బిట్రగుంట – చెన్నై సెంట్రల్ (17237), బిట్రగుంట – చెన్నై సెంట్రల్ (17238), విజయవాడ – హుబ్లీ (17329/17330) రైళ్లు రద్దయ్యాయి. ఆగస్ట్ 5 నుంచి 11 వరకూ విశాఖ – కడప (17487/17488) రైలు రద్దు చేశారు.
  • దారి మళ్లించిన రైళ్లు
  • ఆగస్ట్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ సికింద్రాబాద్ – విశాఖ (12740), ఆగస్ట్ 4వ తేదీన గాంధీనగర్ – విశాఖ (20804), ఆగస్ట్ 7న ఓక – పూరి (20820).
  • ఆగస్ట్ 4, 7 తేదీల్లో నిజాముద్దీన్ – విశాఖపట్నం (12804), ఆగస్ట్ 2 నుంచి 10 తేదీ వరకూ ఛత్రపతి శివాజీ టెర్మినల్ – భువనేశ్వర్ (11019) రైళ్లను రాయనపాడు మీదుగా దారి మళ్లించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement