విజయవాడ – బుడమేరు పరివాహిక ప్రాంతాల్లో లోతట్టు ప్రదేశాలలో నివసిస్తున్న ప్రజలు వరద ముంపు ఉండటం వలన వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలిరావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు.
పరీవాహక ప్రాంతంలో నిరంతరంయంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో, భారీ వర్షపాతం అంచనా వేసినందున, బుడమేరు నదికి ఎప్పుడైనా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. బుడమేరు ప్రాంతాల్లో లోతట్టు ప్రదేశాలలో నివసిస్తున్న ప్రజలు వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు తరలిరావాలని అన్నారు.
ఇరిగేషన్ శాఖ సూచనల ప్రకారం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న బుడమేరు ప్రాంతాలైన గుణదల, సింగనగర్, పరిసర ప్రాంతాలు వరద ముంపు కు గురయ్య అవకాశం ఉన్నందున అక్కడ నివసిస్తున్న ప్రజలందరూ వెంటనే సురక్షితమైన ప్రదేశాలకి తరలి రావాలి అని ఆయన పిలుపు ఇచ్చారు.