Sunday, December 22, 2024

Alert – విజయవాడ-కాజీపేట సెక్షన్ లో ఇంటర్ లాకింగ్ పనులు – పలు రైళ్లు రద్దు

సికింద్రాబాద్ – దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ-కాజీపేట సెక్షన్ లో మోటుమర్రి దగ్గర నాన్ ఇంటర్ లాకింగ్ పనులు అధికారులు చేపట్టారు. సిగ్నలింగ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి జరుగుతున్న ఈ పనులవల్ల కొన్ని ప్రధానమైన రైళ్లను రద్దుచేయడంతోపాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపనున్నారు..

.

ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి అందుకు తగినట్లుగా తమ ప్రయాణానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

రద్దయిన రైళ్లు

గుంటూరు-సికింద్రాబాద్ (12705) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్

సికింద్రాద్-గుంటూరు (12706) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌

రద్దయిన తేదీలు: ఈనెల 28, 29, జనవరి 2,5,7,8,9

కాచిగూడ – మిర్యాలగూడ (07276), మిర్యాలగూడ – నడికుడి (07277) రద్దయిన తేదీలు: ఈనెల 26 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు

నడికుడి – మిర్యాలగూడ (07973), మిర్యాలగూడ – కాచిగూడ (07974)రద్దయిన తేదీలు: ఈనెల 27వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు

గుంటూరు – సికింద్రాబాద్‌ – గుంటూరు గోల్కొండ్‌ ఎక్స్‌ప్రెస్‌ (17201/17202)రద్దయిన తేదీలు: ఈనెల 27వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు గుంటూరు నుంచి కాజీపేట వరకే నడుస్తుంది. తిరిగి కాజీపేట నుంచి గుంటూరు వెళుతుంది.

దారి మళ్లించిన రైళ్లు (విజయవాడ నుంచి గుంటూరు మీదుగా సికింద్రాబాద్, వికారాబాద్)విశాఖపట్నం-ముంబై ఎల్‌టీటీ (18519) ఈ నెల 26 నుంచి జనవరి 8 వరకు

షాలిమార్‌ – హైదరాబాద్‌ (18045) జనవరి 6 నుంచి 8వ తేదీ వరకు హైదరాబాద్ – షాలిమార్‌ (18046) జనవరి 7 నుంచి 9వ తేదీ వరకు

సాయినగర్‌ షిర్డీ – కాకినాడ పోర్టు (17205) జనవరి 7నకాకినాడ పోర్టు – సాయినగర్‌ షిర్డీ (17206) జనవరి 8న

సాయినగర్‌ షిర్డీ – మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (17207) జనవరి 8నమచిలీపట్నం – సాయినగర్‌ షిర్డీ ఎక్స్‌ప్రెస్ (17208) జనవరి 7న

ముంబై సీఎస్‌ఎంటీ – భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్ (11019)భువనేశ్వర్‌ – ముంబై సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్‌ (11020) జనవరి 6 నుంచి 8వ తేదీ వరకు

వాడి – వికారాబాద్‌ – సికింద్రాబాద్‌ – పగిడిపల్లి – గుంటూరు – విజయవాడ మీదుగా దారి మళ్లిస్తారు.

షాలిమార్‌ – సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (22849) జనవరి 1, 8 తేదీల్లో

విశాఖపట్టణం – సికింద్రాబాద్‌ (20833) రైళ్లను విజయవాడ – గుంటూరు – సికింద్రాబాద్‌ మార్గంలో నడుపుతారు.

సికింద్రాబాద్‌ – షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్ (12774) 7వ తేదీన గుంటూరు, సికింద్రాబాద్ మీదుగా నడుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement