Tuesday, November 19, 2024

AP: ఏపీ విద్యార్థులకు అలర్ట్… 12న ఇంటర్‌ ఫలితాలు..

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఈ నెల 12వ తేదీన విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి సన్నాహాలు చేస్తోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఫలితాలకు సంబంధించిన అంతర్గత పనులు బుధవారం మధ్యాహ్నంతో పూర్తి కానున్నాయి.

- Advertisement -

ఇందులో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఒకటి, రెండు రోజులు ఆలస్యంగా ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది రెగ్యులర్‌, ఒకేషనల్‌ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరం 5,17,617, రెండో ఏడాది 5,35,056 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

ఇంటర్మీడియట్‌ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇప్పుడు వీరంతా తమ పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలను అప్ లోడ్ చేస్తారు. అనంతరం వారం, పది రోజుల్లో ఏపీ 10వ తరగతి ఫలితాలు సైతం విడుదలయ్యే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement