Monday, November 25, 2024

Aleert – విశాఖ, విజయవాడ రూట్ లో పలు రైళ్లు మ‌ళ్లింపు

భారీగా రైళ్ల రూట్ల‌లో మార్పులు
మారిన షెడ్యూల్ చూసుకోవాల‌ని రైల్వే అధికారుల సూచ‌న‌
క‌డ‌ప – విశాఖ తిరుమ‌ల ర‌ద్దు..
ఎపి సూప‌ర్ ఫాస్ట్ దారి మళ్లింపు
గోదావ‌రికి త‌ప్ప‌ని మార్పులు
విజ‌య‌వాడ కాకుండా రాయ‌న‌పాడులోనే హాల్ట్ లు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – విజ‌య‌వాడ – విశాఖపట్నం విజయవాడ డివిజన్లోని న్యూ వెస్ట్ భీమవరం , విజయవాడ మధ్య మూడవ రైల్వే లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో విశాఖపట్నం జంక్షన్ నుండి కొన్ని రైళ్ళను ఆరు రోజులపాటు పూర్తిగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే నేడు ప్రకటించింది. అంతేకాదు మరికొన్ని రైళ్ళను దారి మళ్ళిస్తున్నట్టు పేర్కొంది.

- Advertisement -

విశాఖ జంక్షన్ నుండి రైళ్ళ రద్దు

మూడవ రైల్వే లైన్ పనుల కారణంగా విశాఖపట్నం నుండి కడప వెళ్లే తిరుమల ఎక్స్ప్రెస్, ఆగస్టు 5వ తేదీ నుండి పదవ తేదీ వరకు కడప నుండి విశాఖపట్నం వెళ్లే తిరుమల ఎక్స్ప్రెస్ ఆరవ తేదీ నుండి 11వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఒక రైళ్ళ దారి మళ్లింపు వివరాలలోకి వెళితే మొత్తం ఏడు జతల రైళ్ళను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్ళించినట్టు పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ దారి మళ్లింపు

విశాఖపట్నం నుండి న్యూఢిల్లీ వెళ్లే ఆంధ్రప్రదేశ్ ఎస్ఎఫ్ ఎక్స్ప్రెస్ నిడదవోలు, గుడివాడ, రాయనపాడు మీదుగా ప్రయాణం చేస్తుంది. తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ స్టాప్లను తాకకుండా ఈ రైలు మళ్లింపు కొనసాగుతుంది. రామవరప్పాడు తాత్కాలిక స్టాప్. న్యూఢిల్లీ నుండి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ నుంచి వచ్చే రైలు కూడా ఇదే మళ్లించిన మార్గంలో నడవనుంది. నేటి నుంచి పదవ తేదీ వరకు ఈ రైళ్ల దారి మళ్ళింపు కొనసాగుతుంది.

గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ దారి మళ్లింపు

విశాఖపట్నం నుండి హైదరాబాద్ గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏలూరు విజయవాడ మీదుగా నడుస్తుంది కానీ రైల్వే లైన్ కమిషన్ పనుల నేపథ్యంలో నిడదవోలు గుడివాడ రాయనపాడు మీదుగా రామవరప్పాడు స్టాప్ లో ఆగి తిరిగి కొనసాగుతుంది. నేటి నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు ఈ రైలు దారి మళ్లింపు కొనసాగుతుంది.

లోకమాన్య తిలక్ ఎల్టీటీ ఎక్స్ ప్రెస్ దారి మళ్లింపు

ఇక విశాఖపట్నం నుండి లోకమాన్య తిలక్ ఎల్టిటి ఎక్స్ప్రెస్ రామవరప్పాడు విజయవాడ రాయలపాడు మీదుగా ప్రయాణం చేయాల్సి ఉండగా ఇది రామవరప్పాడు రాయలపాడు మీదుగా వెళుతుంది. విజయవాడ స్టేషన్ ను ఇది దాటవేసి నడుస్తుంది తాత్కాలికంగా రామవరపాడులో ఆగుతుంది పదవ తేదీ వరకు ఈ దారి మళ్లింపు కొనసాగుతుంది.

గరీబ్ రథ్ దారి మళ్లింపు

సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ కూడా విజయవాడ స్టేషన్లో ఆగకుండా రాయనపాడు గుణదల మీదుగా వెళుతుంది. ఇది నేటి నుంచి 10వ తేదీ వరకు ఈ మార్గంలో నడుస్తుంది. విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ కూడా మళ్లించిన మార్గంలోని కొనసాగుతుంది.

గాంధీ ధామ్, సాయినగర్ షిరిడీ రైళ్ళు దారి మళ్లింపు

విశాఖపట్నం- గాంధీధామ్ వెళ్లే వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, గాంధీధామ్- విశాఖపట్నం తిరుగు రైలు కూడా విజయవాడ స్టేషన్ లో ఆగకుండా గుణదల రాయలపాడు మీదుగా సాగుతుంది. సాయినగర్ షిరిడి వెళ్లే విశాఖపట్నం సాయి నగర్ షిరిడి ఎక్స్ప్రెస్, విశాఖపట్నం నుండి సాయి నగర్ షిరిడి వెళ్లే రైలు కూడా విజయవాడ స్టేషన్లో ఆగకుండా రాయనపాడు గుణదల మీదుగా సాగుతుంది. ఇది 9వరకు మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

స్వర్ణజయంతి ఎక్స్ ప్రెస్ దారి మళ్లింపు

విశాఖపట్నం నుండి హజరత్ నిజాముద్దీన్ వెళ్లే స్వర్ణజయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విజయవాడ స్టేషన్లో ఆగకుండా గుణదల రాయనపాడు మీదుగా నడుస్తుంది. ఆగస్టు 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఈ రైలు దారి మళ్లింపు కొనసాగుతుంది. హజరత్ నిజాముద్దీన్ నుండి విశాఖపట్నం వచ్చే స్వర్ణజయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా మళ్లించిన మార్గంలోనే నడుస్తుంది ఇది నాలుగవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు మళ్లించిన మార్గంలో కొనసాగుతుంది.

నాగ‌పూర్ డివిజ‌న్ లోనూ..

నాగపూర్‌ డివిజన్‌లో ఇంటర్‌లాకింగ్‌ పనుల దృష్ట్యా పలు రైళ్లను విజయవాడ, బలార్ష, నాగ్‌పూర్‌ మీదగా దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
రైలు నంబరు 12807/12808 విశాఖపట్నం-హజ్రత్‌ నిజాముద్ధీన్‌ (ఆగస్టు 6, 10, 11, 12, 13, 14, 15, 18 తేదీల్లో), 22815/22816 ఎర్నాకుళం-బిలాస్‌పూర్‌ (ఆగస్టు 12, 14 తేదీల్లో), 22847/22848 ఎల్‌టీటీ ముంబయి-విశాఖపట్నం(ఆగస్టు 18,20 తేదీల్లో).
రైలు నంబరు 12771/12772 సికింద్రాబాద్‌-రాయ్‌పూర్‌ (ఆగస్టు 7, 8, 14, 15 తేదీల్లో), 12767/12768 నాందెడ్‌-సంత్రాగచి (ఆగస్టు 12,14 తేదీల్లో) పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement