తెనాలి, ప్రభన్యూస్ : స్థానిక నాలుగో వార్డ్ బిసి కాలనీలో ఎప్పటినుంచో తాగునీటి సమస్య పట్టిపీడిస్తుంది. ఈ సమస్యను ప్రభుత్వం గానీ మున్సిపల్ అధికారులు గానీ పట్టించుకోకపోవడంతో వార్డు కౌన్సిలర్ అడుసుమిల్లి వెంకటేశ్వరరావు అక్కడి ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ఏర్పాటు చేశారు. శనివారం తెనాలి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్లాంటును ప్రారంభించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకుకనీస అవసరమైన తాగునీటిని అందించలేని దౌర్భాగ్య స్థితిలో తెనాలిలో ప్రభుత్వ పరిపాలన నడుస్తుందని.ఇది సిగ్గుచేటు అని అన్నారు.
సమస్య తీవ్రతను గుర్తించిన వెంకటేశ్వరరావు ప్రజల మనిషిగా సమస్య తీవ్రతను గుర్తించి ఉచిత వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు కార్యక్రమంలో బుర్ర సాయి మాధవ్, జాని భాష, ఈదర వెంకట పూర్ణచంద్, పెమ్మసాని శ్రీను, మంగమూరి హరి ప్రసాద్, గుమ్మడి ప్రసాద్, కుద్దూస్, పిన్నారావు, త్రిమూర్తి,మల్లవరపు విజయ్, బోయపాటి అరుణ, దివి అనిత, దేసు యుగంధర్, కొల్లూరు శ్రీదర్, శాఖమూరి చిన్నా , సురేంద్ర, డోగుపర్తి విజయ్, గిరి గణేష్ అడుసుమల్లి వంశీ ,చందు, మదన్ సాయి, సురేంద్ర, రజినీకాంత్,తాడిబోయిన హరి ప్రసాద్, కనకరాంబాబు, కుదరవల్లి శ్రీనివాసరావు మాదల కోటేశ్వరరావు స్థానికులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..