Friday, November 22, 2024

Breaking: అలకవీడిన బాలినేని.. జగన్​తో రెండు గంటలకు పైగా భేటీ

ఏపీ సీఎం జగన్ కేబినెట్​లో సెకండ్​ ఇన్నింగ్స్​ ఉంటుందని ఆశించిన బాలినేనికి ఆశాభంగం ఎదురైంది. తనతో తొలివిడతలో పనిచేసిన వారిలో 11మందికి మళ్లీ చాన్స్​ దక్కింది. తనకు కూడా మంత్రి పదవి తప్పకుండా వస్తుందనుకుంటే రాకుండా పోయింది. దీంతో అతని అనుచరులు ప్రకాశం జిల్లాలో వీరంగం సృష్టించారు. బైకులు, టైర్లు కాలబెట్టి, ఒంటిపై పెట్రోల్​ పోసుకుని నిరసన తెలిపారు. అయితే.. బాలినేని కూడా ఈ విషయంలో రాజీనామా చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఆయన అలకబూని ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. దీంతో సీఎం జగన్​ స్వయంగా ఆయనను ఇవ్వాల పిలిపించుకుని మాట్లాడారు.

సీఎం జగన్​తో జరిగిన భేటీ తర్వాత మాజీ మంత్రి బాలినేని మీడియాతో మాట్లాడారు. తనకు మంత్రి రాకపోవడంతో కాస్త బాధపడ్డ విషయం నిజమేనని, కానీ రాజీనామా చేస్తున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. అంతేకాకుండా ప్రకాశం జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలపు సురేశ్​తో తనకెప్పుడు విభేదాలు లేవని, మీడియాలో తప్పుడు కథనాలు వచ్చాయన్నారు. వైఎస్సార్​​ కుటుంబానికి తాము ఎప్పటినుంచో సన్నిహితులమని, వారికి విధేయులుగానే ఉంటామని చెప్పుకొచ్చారు బాలినేని. కాగా, సీఎం జగన్​ అప్పగించిన బాధ్యతలను ఎవైనా సక్రమంగా నిర్వర్తిస్తానని, ఎలాంటి బాధ్యతలు అప్పగించినా పనిచేస్తానన్నారు బాలినేని. సామర్థ్యం ఉన్నవారినే మంత్రులుగా నియమించారని కితాబిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement