Wednesday, October 23, 2024

AP | టిడ్కో ఛైర్మ‌న్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అజ‌య్ కుమార్

ఆంధ్రప్రదేశ్ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ టిడ్కో) చైర్మన్ గా వేములపాటి అజయ్ కుమార్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లోని టిడ్కో ఆఫీసులో బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ… పట్టణ, నగర ప్రాంతాల్లోని గూడులేని పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి కృషి చేస్తానన్నారు.

త‌న మీద నమ్మకంతో త‌నకు చాలా ప్రతిష్టాత్మకమైన పదవిని ఇచ్చినందుకు నమ్మకంగా, బాధ్యతాయుతంగా పనిచేస్తానని అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. అదేవిధంగా ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కశ్యాణ్ కి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి. నారాయణలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. పట్టణాల్లో అర్హులైన పేదలందరికీ టిడ్కో ఇళ్లు అందిస్తామన్నారు. త‌న శక్తి వంచన లేకుండా పనిచేస్తానన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement