Tuesday, November 26, 2024

గిరిజన యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం: ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి

గుమ్మలక్ష్మీపురం, (ప్రభ న్యూస్‌) : గిరిజన యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా వైఎస్‌ జగన్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి తెలిపారు. ఆదివారం ఆమె జీఎల్‌పురం వైటీసీలో శిక్షణ పొందిన గిరిజన యువతకు సర్టిఫికెట్లు ప్రధానం చేసే సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో చదువుకొని ఖాళీగా ఉన్న యువతకు స్వయం ఉపాధి కల్పనా కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. వీటిని గిరిజన యువత సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా బలోపేతం కావాలని కోరారు. కురుపాంలో 120 కోట్లతో ఇంజనీరింగ్‌ కళాశాల, జిల్లాలో గిరిజన యూనివర్సిటీ, విశాఖ జిల్లా, పాడేరులో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

అలాగే రాష్ట్రంలో మూడు లక్షలా ఎకరాల అటవీ భూమికి పోడు పట్టాలు ఇవ్వడం జరిగిందని గిరిజన ప్రాంత అభివృద్ధి కోసమే ఇటువంటి శిక్షణలు అందిస్తున్నామని ఆమె తెలిపారు. అలాగే రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు, వాలంటీర్ల వ్యవస్థతో యువతకు ఉపాధి ఎక్కువగా కల్పిస్తున్నామని ఆమె తెలిపారు. వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజన ప్రాంతంలో గిరిజన రైతులకు పోడుకు పట్టాలు ఇచ్చామని తెలిపారు. అనంతరం శిక్షణ పొందిన అభ్యర్ధులకు సర్టిఫికెట్లు ప్రధానం చేసారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దీనమయ్య, ఉపాధిక్షులు నిమ్మక శేఖర్‌, ఐటీడీఏ ఏపీవో సురేష్‌కుమార్‌, జెడ్పీటీసీ మందంగి రాధిక, వైసీపీ నాయకులు నిమ్మక గోపాల్‌, జీఎల్‌పురం సర్పంచ్‌ బి. గౌరీశంకర్‌రావు, ఉపసర్పంచ్‌ కిషోర్‌కుమార్‌, మండల కోఆప్షన్‌ సభ్యురాలు దివ్య మహాపాత్రో, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement