Tuesday, November 19, 2024

ఈ–పరామర్శ ఆరోగ్య సేవలు

గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌–ఎయిమ్స్‌)లో శనివారం నుంచి ఈ–పరామర్శ ఆరోగ్య సేవలు(టెలీ మెడిసిన్‌) అందుబాటులోకి తేనున్నట్టు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ముఖేష్‌ త్రిపాఠి తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెలీ మెడిసిన్‌ సేవలను అందుబాటులోకి తేవడం ప్రజలు గమనించి ఇంటి వద్ద నుంచే వైద్య సేవలను అందుకోవాలని కోరారు.

సామాజిక కుటుంబ వైద్య విభాగం ఫోన్‌ నంబర్‌ 9494908320, చెవి ముక్కు, గొంతు విభాగం 9494906407, జనరల్‌ మెడిసిన్‌ 9494908526, జనరల్‌ సర్జరీ 9494901428, ప్రసూతి స్త్రీల విభాగం 9494907302, చిన్న పిల్లల విభాగం 9494902674, దంత వైద్య విభాగం 9494907082, నేత్ర వైద్య విభాగం 9494905811, చర్మవ్యాధుల విభాగం 9494908401, మానసిక వైద్య విభాగం 9494730332, విచారణకు 94939065718 & 8523007940 ఫోన్‌ నంబర్లలో ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకుని వైద్యసేవలను అందుకోవచ్చన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా ఇంటి వద్ద నుంచే టెలీ మెడిసిన్‌ ద్వారా వైద్య సేవలను అందుకుని సహకరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement