విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరచాలనే మంచి ఉద్దేశంతోనే ఎయిడెడ్ విద్యా సంస్థలు ప్రభుత్వంలో విలీనానికి వివిధ ఎంపికలతో ప్రభుత్వం విధానాన్ని వారి ముందు ఉంచడం జరిగిందని కలెక్టర్ జె. నివాస్ అన్నారు.
శుక్రవారం ఇరిగేషన్ కాంపౌండ్ లోని రైతు శిక్షణ కేంద్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యలు, కరస్పాండెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనంపై ఎటు-వంటి బలవంతం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను యాజమాన్యం నడుపుకోవాలంటే యథావిధిగా నడుపుకోవచ్చున్నారు. విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలపై నిర్ణయం తీసుకోవాడంజరిగిందన్నారు.
100 సంవత్సరాల ముందునుంచే చరిత్ర ఉన్న ఎయిడెడ్ సంస్థలు విద్యా అభివృద్ధికి అక్షరాస్యత పెంపునకు ఎంతో కృషి చేశాయని ఇందుకు ఆ సంస్థలను అభినందించాల్సిందేనన్నారు. అయితే కాలక్రమేణ విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య తగ్గడం వంటి పలు నిర్వహణ అంశాలతో ఎయిడెడ్ విద్యా సంస్థలు పలు సమస్యలను ఎదుర్కొవడం ప్రభుత్వం గుర్తించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుతంలో విలీనం చేసుకుని ఎయిడెడ్ సంస్థల స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన చేయడం జరిగిందన్నారు.
ఇందుకు ఎయిడెడ్ సంస్థల ముందు అనేక ఐచ్చికంతో కూడిన కొన్ని ఎంపికలను ఉంచడం జరిగిందన్నారు. యాజమాన్యం, ఉపాధ్యాయులు ఉమ్మడి సమ్మతితో మాత్రమే తప్ప విలీనం పై ప్రభుత్వం ఎటు-వంటి ఒత్తిడి తీసుకురావడం లేదని ఎయిడెడ్ అప్పగింత స్వచ్ఛందమేనని ఆయన స్పష్టం చేశారు. నాలుగోవ అర్షన్ కూడా ప్రభుత్వం ఇచ్చిందన్నారు. గతంలో అప్పగింతకు ముందుకు వచ్చి తిరిగి దానిని రద్దు చేసుకోవలంటే యాజమాన్యం, ఉపాధ్యాయులు ఉమ్మడిగా పాతపద్దతికే వెళతామని ప్రతిపాదనలు అందిస్తే వాటిని పరిశీలించడం జరుగుతుందన్నారు. ఇటు-వంటి వాటికి సంబంధించి ఉత్తర్వులు జారీ విషయాని గురువారం పాఠశాల విద్యా కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ లో తెలపడం జరిగిందన్నారు. జిల్లాలో 635 ఎయిడెడ్ పాఠశాలలు ఉండగా వాటిలో 222 మూసివేయగా 3 విద్యా సంస్థలు ఆస్థులు పూర్తిగా అప్పగింతకు ప్రతిపాదనలు అందించగా, మరో 115 విద్యా సంస్థలు టీ-చింగ్ స్టాప్ తో విలీనంకు తమ ఆమోదం తెలిపాయన్నారు. మరో 155 ఎయిడెడ్ విద్యా సంస్థలు అప్పగింతకు గతంలో అంగీకరించిన యాజమాన్యలు తమ ప్రతిపాదనలను ఉపసంహరించుకునేందుకు తిరిగి దరఖాస్తు చేయడం జరిగిందన్నారు. ఎయిడెడ్ యాజమాన్యలు తమ విద్యా సంస్థలను యాధావిధిగా నడుపుకునే సమయంలో ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులను మాత్రమే వసులు చేయాలని ప్రభుత్వం కోరడం జరిగిదన్నారు. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన యధావిధిగా వర్తింపు అవుతాయన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ డి. మధుసూధనరావు, డిఇఓ తాహేర సుల్తానా, అసిస్టెంట్‌డైరెక్టర్లు జి. శ్రీనివాసరావు, యండి అజీజ్, యండియం ఏడి కె. వేణుగోపాలరావు, డిప్యూటి డిఇఓలు కె. రవికుమార్, వివి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.