Sunday, November 24, 2024

AP | కేంద్రం నుంచి సాయం అవాస్త‌వం : చంద్రబాబు

కేంద్రం నుంచి 3,300 కోట్ల సహాయం వచ్చిందన్న మాట అవాస్తవమని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. తాము ఇంకా కేంద్రానికి ప్రాథమిక నివేదికలే పంపలేదని తెలిపారు. ప్రస్తుతం బుడమేరు గండ్లును పూడ్చడమే తమ లక్ష్యమని… అదే పనిలో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంభవించిన వరద నష్టంపై నివేదిక తయారుచేశాం, శనివారం ఉదయం (సెప్టెంబర్ 7న) కేంద్రానికి ఏపీ ప్రభుత్వం నివేదిక పంపుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

బాధితులకు సాయంపై కేంద్రంతో మాట్లాడుతున్నామని.. ఏరియల్‌ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలన్నీ పరిశీలించానని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం తమ లక్ష్యం అంతా బుడమేరు గండ్లు పూడ్చడమేనని తెలిపారు చంద్రబాబు. ఇప్పటికే ఆర్మీ కూడా వచ్చిందని, శనివారం నాటికి మూడో గండి పూడ్చే విధంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు.

దాంతో పాటూ వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు కూడా యుద్ధప్రాతిపదికన చేపట్టామని బాబు చెప్పారు. 3.12 లక్షల ఆహార పొట్లాలు, 11.5 లక్షల వాటర్‌ బాటిళ్లు, పాలు, బిస్కెట్లు, కొవ్వొత్తులు పంపిణీ చేశాం. నీరు నిల్వ ఉన్న చోట తప్ప మిగతా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించాం.

గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చాం. వరద ప్రాంతాల్లో 72శాతం పారిశుద్ధ్య పనులు పూర్తి చేశాం. 7,100 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తున్నారు. 1,300 పీడీఎస్‌ వాహనాలు తిరుగుతున్నాయి. మూడు రోజులు మొత్తం అన్నీ ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు. మరోవైపు చిన్న చిన్న పనులుంటే బయటకు వెల్లడానికి ఫ్రీ బస్సులను కూడా ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement