Friday, November 22, 2024

‘ఆహ్‌.. తుత్తెరి’.. య‌ముడికే హెల్త్ బాగాలేదట!

చాలా సినిమాల్లో య‌ముడి పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకున్న వ్య‌క్తి ఆయ‌న‌. ఈ త‌రం పిల్ల‌ల‌కు య‌ముడు ఎట్లా ఉంటాడంటే.. అత‌డిన రూప‌మే స్ఫుర‌ణ‌లోకి వ‌స్తుంది. మ‌రి అట్లాంటి వ్య‌క్తికే హెల్త్ బాగాలేద‌న్న వార్త ఇప్పుడు అంద‌రినీ ఆందోళ‌న‌కు గురిచేస్తోంది..

సీనియర్ నటుడు కైకాల సత్యానారయణకు హెల్త్ బాగా లేక‌పోవ‌డంతో శనివారం రాత్రి హుటాహుటిన హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు. సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితం ప్రమాదవశాత్తు స‌త్య‌నారాయ‌ణ త‌న ఇంట్లో జారిపడ్డారు.

అంద‌రూ చాలా చిన్న గాయమే అనుకున్నారు. కానీ, నిన్న రాత్రి పెయిన్‌ ఎక్కువగా ఉండటంతో హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం సత్యనారాయణ హెల్త్ సిచ్యుయేష‌న్ స్టేబుల్‌గానే ఉందని కుటుంభ సభ్యులు తెలిపారు. అభిమానులెవరూ ఆందోళన పడాల్సిన‌ అవసరం లేద‌న్నారు.

త్వరలోనే ఆయన డిశ్చార్జి అవుతారని స‌త్య‌నారాయ‌ణ ఫ్యామిలీ మెంబ‌ర్స్ వెల్లడించారు. 2019లో విడులైన ఎన్టీఆర్ కథనాయకుడు, మహర్షి చిత్రాల తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు కైకాల సత్యనారాయణ. వయసు మీద పడడంతో పాటు అనారోగ్య సమస్యలతో విశ్రాంతి తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement