అమరావతి, ఆంధ్రప్రభ: వికసిత భారత సంకల్ప యాత్రలో భాగంగా అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా అరకు మండలంలో రైతులకు డ్రోన్ ద్వారా వివిధ వ్యవసాయ ప్రక్రియలపై అవగాహన కల్పించారు. ప్రధాని నరేంద్రమోడీ సంకల్పంతో దేశవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి వికసిత భారత్ సంకల్పయాత్ర నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో గవరన్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సంకల్ప యాత్రను అరకు నుంచి ప్రారంభించారు.
ఇందులో భాగంగా బుదవారం అరకు వ్యాలిలోని చినలబుడు, పాచిపెంట గ్రామాల్లో కృషి విజ్ఞాన కేంద్రం కోండెంపూడి వ్యవసాయ అధికారులు రైతులకు, గ్రామస్తులకు వివిధ వ్యవసాయ ప్రక్రియలపై అవగాహాన కల్పించారు. మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ డిప్యూటి మేనేజర్ టి కిషోర్‌బాబు నేతృత్వంలో గరుడ ఏరోస్పెస్ సిబ్బంది గ్రామంలో డ్రోన్ ప్రదర్శనను నిర్వహించారు.
ఇందులో రైతులకు డ్రోన్ ద్వారా మందుల పిచికారి, విత్తనాల జల్లడం వంటి విధానాల గురించి వివరించారు. అరకువ్యాలీ వికసిత భారత్ సంకల్ప యాత్ర పర్యవేక్షకులు, ఎంపిడిఓ సిహెచ్ వేంకటేష్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు వికసిత భారత్‌సంకల్ప యాత్ర ర్యాలీ నిర్వహించారు. ఇందులో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.