Tuesday, November 26, 2024

కోకాకోలా కంపెనీని కొనుగోలు చేయనున్న ఎలాన్‌ మస్క్

ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్ ఇప్పుడు కోకాకోలా కంపెనీని కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో కోకాకోలాను కొనుగోలు చేస్తానని వెల్లడించారు. కోకాకోలాని కొనుగోలు చేసి ఇల్లీగల్‌ డ్రగ్‌గా పేరున్న కొకైన్‌ను కోకా కోలాకు తిరిగి చేరుస్తానని కూడా మ‌స్క్ వ్యాఖ్యానించారు. కోకా కోలా కూల్ డ్రింక్‌లో కోకా ఆకులు, కోలా గింజలు ఉండేవి. కోకా ఆకుల నుంచి సైకోయాక్టివ్ డ్రగ్ కొకైన్ వస్తుంది. అప్ప‌ట్లో కోకా కోలా కూల్ డ్రింక్ అధికంగా కోకా ఆకుల మీదే ఆధారపడేది. ఆ రోజుల్లో కొకైన్‌ను ఔషధంగా పరిగణించినప్పటికీ, చివ‌ర‌కు నిషేధిత జాబితాలో చేర్చారు. అమెరికా కూడా దానిని నిషేధించడంతో కోకా కోలా నుంచి కోకా ఆకులు దూరమై అందుకు బదులుగా డీకోకైనైజ్డ్ కోకా ఆకులు వచ్చాయి. 

ఈ నేప‌థ్యంలో మస్క్ కోకా కోలాకు తిరిగి కొకైన్ ను తీసుకొస్తానంటూ ట్వీట్‌ చేయడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాగా, ఇప్ప‌టికే ట్విట్టర్‌ను ఎలాన్‌ మస్క్ 44 బిలియన్లకు కొనుగోలు చేశారు. ఆ సంస్థ ఒక్కో షేరును 54.20 డాలర్లకు కొనుగోలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement