Tuesday, November 5, 2024

AP | నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండండి – మంత్రులతో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాగా, ఈ భేటీ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వ పనితీరుపై నెల రోజుల ప‌నితీరుపై చర్చించారు.

ప్రభుత్వం పూర్తిగా లోటు బడ్జెట్‌లో ఉందని గ్రహించి మెసలుకోవాలంటూ మంత్రులకు కీలక సూచనలు చేశారు. హెచ్‌ఓడీలతో సహా శాఖలకు సంబంధించిన సమస్యలపై నెలవారీ సమీక్షలు నిర్వహించాలని మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ… తమ శాఖల పరిస్థితిని ప్రజలకు వివరించాలని సూచించారు.

పార్టీ కార్యాలయంలో మంత్రులు అందుబాటులో ఉండాల్సిందేనని.. మరోసారి స్పష్టం చేశారు చంద్రబాబు. అధికార దురభిమానం వద్దని మంత్రులకు హితవు పలికిన ఏపీ సీఎం.. ఎమ్మెల్యేలు సమన్వయంతో వెళ్లాలని మంత్రులకు చంద్రబాబు ఆదేశాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement