ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజీ, లంక గ్రామాలు, తూర్పుగోదావరి జిల్లా, యానాం ప్రాంతాల్లో పరిస్థితులను హెలికాప్టర్ ద్వారా సుమారు గంటన్నర పాటు ప్రత్యక్షంగా పరిశీలించారు. ముంపునకు గురైన పొలాలు, ఇళ్లు, రహదారులను పరిశీలించి పరిస్థితిపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం తన క్యాంపు కార్యాలయం నుంచి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. సీఎం జగన్ ఏరియల్ సర్వే వీడియోను సీఎంఓ కూ యాప్ లో పోస్ట్ చేసింది.
గోదావరి వరద ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే.. కూయాప్ లో వీడియో పోస్ట్..
Advertisement
తాజా వార్తలు
Advertisement