Monday, November 18, 2024

ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో పత్తిధర..

ఆదోని టౌన్‌, (ప్రభ న్యూస్‌) : రాష్ట్రంలో రెండవ జాతీయ మార్కెట్‌ యార్డుగా పేరు గాంచిన ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్‌లో పత్తి రోజు రోజుకు పెరుగుతోంది. గరిష్ట స్థాయిలో రూ.10,769 ధర పలికి అదరగొట్టింది. వర్షాభావ పరిస్థితుల వల్ల తెల్లబంగారం దిగుబడి తగ్గడం, పత్తి నిల్వలు లేకపోవడమే ధర పెరుగుదలకు ప్రధాన కారణమని రైతులు పేర్కొంటున్నారు. గత సంవత్సరం కంటే ఉత్పత్తులు తగ్గుముఖం పట్టడంతో గత పది రోజులు నుంచి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ధరలు పెరగడంతో మార్కెట్‌ యార్డుకు తరలివస్తున్న అన్నదాతల ముఖంలో ఆనందం కనిపిస్తోంది.

మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ మహబూబ్‌భాషా, మార్కెట్‌ యార్డు సెక్రెటరీ శ్రీకాంత్‌రెడ్డిలు మాట్లాడుతూ నాణ్యత బట్టి పత్తి, వేరుశనగ, వివిధ రకాల పంటల ఉత్పత్తులకు రేటు ధరలు ఉంటాయని రాబోయే కాలంలో ధరలు తగ్గకుండా రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గురువారం ఆదోని జాతీయ మార్కెట్‌ యార్డులో పత్తి కనిష్ట ధర రూ.6,469, గరిష్ట ధర రూ.10,769, వేరుశనగ కనిష్ట ధర 3,779, గరిష్ట ధర రూ. 6,061, ఆముదాలు కనిష్ట ధర రూ.4,853, గరిష్ట ధర రూ.6,129పూల విత్తనములు కనిష్ట ధర రూ.3,550 గరిష్ట, రూ.5,386లుగా పలికాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement