అమరావతి,ఆంధ్రప్రభ: పాలిసెట్ తుది దశ అడ్మిషన్ల ప్రక్రియలో 2174 మంది విద్యార్థులకు నూతనంగా ప్రవేశాలు కల్పించినట్లు సాంకేతిక విద్యాశాఖ కమీషనర్, పాలిటెక్నిక్ అడ్మిషన్ల కన్వీనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మొత్తంగా 267 కళాశాలల్లో 41.4శాతం మేర 34050 సీట్లు భర్తీ అయ్యాయని వివరించారు. 88 ప్రభుత్వ పాలిటెక్నిక్ లకు గాను 54.2 శాతం మేర 9835 సీట్లు భర్తీ అయ్యాయన్నారు.
179 ప్రైవేట్ పాలిటెక్నిక్ లలో 37.8 శాతంగా 24215 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేశామన్నారు. సీట్ల కేటాయింపు పూర్తి అయినందున సెప్టెంబర్ 7వ తేదీ లోపు నాలుగు రోజుల వ్యవధిలో విద్యార్ధులు అయా కళాశాలల్లో రిపోర్టు చేయవలసి ఉంటుందన్నారు. క్లాసులు ఇప్పటికే ప్రారంభం అయినందున విద్యార్థులు వేగంగా ప్రవేశాలు పొందాలని చదలవాడ నాగరాణి స్పష్టం చేసారు