Friday, November 22, 2024

రికార్డు స్థాయిలో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు.. మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో గతంలో ఎన్నడూ లేనట్లు రికార్డు స్థాయిలో విద్యార్ధుల అడ్మిషన్లు జరిగాయని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం ఉత్తీర్ణులైన 3,37,987 మంది విద్యార్ధుల్లో దాదాపు 3,15,600 మంది విద్యార్ధులు వివిధ కోర్సుల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రవేశం పొందారని ఆయన పేర్కొన్నారు. డిగ్రీ కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియపై ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొ.హేమచంద్రా రెడ్డిలతో విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం నాడు సమీక్ష జరిపారు. గతంలో కంటే డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పడిపోయాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

- Advertisement -

ప్రస్తుత విద్యా సంత్సరంలో ఉత్తీర్ణులైన 3,37,987 మంది విద్యార్ధుల్లో దాదాపు 3,15,600 మంది (93.38 శాతం) విద్యార్ధులు వివిధ కోర్సుల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రవేశం పొందారని ఆయన పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన వారిలో కేవలం 22 వేల పైచిలుకు విద్యార్దులు మాత్రమే ఉన్నత చదువుల్లో ప్రవేశం పొందలేదన్నారు. ఈ ఏడాదిలో ఇంతవరకు ఇంజనీరింగ్‌ కోర్సుల్లో 1.20 లక్షల మంది, ఫార్మసీ లో 12 వేల మంది, వ్యవసాయం- ఆక్వాకల్చర్‌లో 5 వేల మంది తోపాటు, మెడికల్‌ & నర్సింగ్‌ కోర్సుల్లో 15 వేల మంది అడ్మిషన్లు పొందారని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. అలాగే వివిధ డిగ్రీ కోర్సుల్లో 1.48 లక్షల మంది ఐఐఐటి, ఎన్‌ఐటి వంటి కోర్సుల్లో 5600 మంది ఇతర రాష్ట్రాల్ల్రో మరో 10 వేల మంది ప్రవేశాలు పొందారన్నారు. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన వారిలో అత్యధిక శాతం పై చదువులకు ప్రవేశాలు పొందడం మంచి పరిణామమని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement