తిరుపతి: రానున్న రోజుల్లో ఎనిమిదో తరగతి నుంచి కోడింగ్ విద్య తప్పనిసరి ఉంటుందని తెలిపారు ఎపి విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, . రాబోయే ఏడాది నుంచి ఇంటర్ నుంచి ఆన్‌లైన్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి పార్లమెంటు పరిధిలో స్కిల్ డెవలెప్మెంట్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశోధనలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ప్రొఫెసర్‌లు విధులు సరిగ్గా నిర్వర్తించకున్నా, టీచింగ్ ఆక్టివిటీలో పాల్గొనక పోయినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఒంగోలులో టీచర్ ట్రైనింగ్‌కు ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు
Advertisement
తాజా వార్తలు
Advertisement