తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలానికి చెందిన ఓ యువకుడికి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో జరిగిన సైబర్ క్రైమ్తో సంబంధం ఉన్నట్టు వెల్లడయ్యింది. ఈ మేరకు ఇవ్వాల (మంగళవారం) నెల్లూరు సిటీ ఆరో టౌన్ పోలీసులు నేరడిగొండ బుగ్గారం బి గ్రామానికి వచ్చి ఆ యువకుడిని తీసుకెళ్లారు. దీనికి సంబంధించి లోకల్ పోలీసు స్టేషన్లో సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.
అయితే.. నెల్లూరులో కోటి రూపాయల గోల్మాల్ విషయంలో ఈ యువకుడి హస్తం ఉన్నట్టు పోలీసుల ద్వారా తెలిసింది. ఈ యువకుడి బ్యాంక్ అకౌంట్లో కోటి రూపాయల నగదు జమ అయినట్టు పోలీసుల విచారణలో వెల్లడయ్యిందని నెల్లూరు జిల్లా ఆరో పట్టణ పోలీస్స్టేషన్ సీఐ తెలిపారు. పెద్ద మొత్తంలో లావాదేవీలు జరగడంతో విచారణ జరపనున్నట్టు వెల్లడించారు.