Friday, November 22, 2024

AP: వైభవంగా ఆదిదంపతుల గిరి ప్రదక్షణ…

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : ఆది దంపతుల గిరిప్రదక్షణ అత్యంత వైభవంగా నిర్వహించారు. విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రి చుట్టూ అమ్మవారి ఉత్సవ విగ్రహాలను అంగరంగ వైభవంగా ఊరేగిస్తూ గిరిప్రదక్షణను నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా ఇవాళ ఉదయం లోకకళ్యాణార్థం, భక్త జనశ్రేయస్సు కోసం, ధర్మప్రచారం నిమిత్తం వేదపండితుల మంత్రోచ్చరణలు, అమ్మవారి నామస్మరణలు, మంగళ వాయిద్యముల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం (ఘాట్ రోడ్ ఎంట్రన్స్) వద్ద శ్రీ స్వామి, అమ్మవార్లుకు ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తముగా పూజలు నిర్విహించి, కొబ్బరి కాయ కొట్టి గిరిప్రదక్షిణ కార్యక్రమంను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు చింకా శ్రీనివాసులు, బచ్చు మాధవీ కృష్ణ, కార్యనిర్వాహక ఇంజినీర్ కేవీఎస్ కోటేశ్వర రావు, లింగం రమాదేవి, సహాయ కార్యనిర్వాహనాధికారి పి.చంద్ర శేఖర్, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గిరిప్రదక్షిణ కార్యక్రమం శ్రీ కామధేను అమ్మవారి ఆలయం, కుమ్మరిపాలెం సెంటర్, నాలుగు స్థంబాల సెంటర్, సితార, కబేలా, పాల ఫ్యాక్టరీ, చిట్టి నగర్, కొత్తపేట, నెహ్రు బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ మీదుగా డప్పులు, బేతాల నృత్యములు తదితర సాంస్కృతిక కార్యక్రమాల నడుమ తిరిగి ఆలయంనకు చేరుకున్నారు.

గిరిప్రదక్షణ మార్గం నందు భక్తులు ప్రచార రథంలో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు, స్వామి వార్లకు భక్తిశ్రద్దలతో పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి, పూజలు చేసి, అమ్మవారిని, స్వామి వారిని ప్రార్థించి, అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement