Friday, November 22, 2024

Adhoni – ఏసీబీకి చిక్కిన ముగ్గురు మునిసిప‌ల్ ఉద్యోగులు

ఆదోని పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటుండగా ముగ్గురు మున్సిపల్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.. ఏసీబీ డీఎస్పీ డి.ఎస్.పి వెంకటాద్రి వెల్లడించిన మెరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆదోని మున్సిపల్ కార్యాలయం పై ఏసిబి అధికారుల బృందం దాడులు నిర్వహించింది. ఓ వ్యక్తి నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా మున్సిపల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు మహాలక్ష్మి, చరణ్ లను అదుపులోకి తీసుకొన్నారు.

వారి వద్ద నుండి లంచం తీసుకున్న 10 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆదోని పట్టణంలోని మున్సిపల్ స్కూల్లో టీచర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు ఇటీవలనే సస్పెండ్ అయ్యారు. నాన్ డ్రయల్ సర్టిఫికెట్ కోసం మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్లు చరణ్, మహాలక్ష్మి లు రూ .30 వేలు డిమాండ్ చేసినట్లు శ్రీనివాసులు తమను సంప్రదించారన్నారు.పథకం ప్రకారం మొదటి విడతగా రూ.5వేలు ఇవ్వగా, సోమవారం మరో రూ 10 వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిపై కేసు న‌మోదు చేసి ఉన్న‌తాధికారుల‌కు తెలిపామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement