ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపులకు ఇచ్చే అంశంపై పరిశీలన చేయాలని ఏపీ సీఎం జగన్ కి కాపు నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. అందరూ తీసుకోగా మిగిలిన రిజర్వేషన్లనైనా తమకు కల్పించాలని కోరారు. రిజర్వేషన్లు కల్పించి పేద కాపులకు మంచి చేయాలని విన్నవించారు. దివంగత ఎన్టీఆర్, వైఎస్సార్ లను ప్రజలు దేవుళ్లగా భావించారని… వారిమాదిరి పేద ప్రజలకు సేవ చేయాలని సూచించారు.
గత ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో మినహా అన్ని చోట్ల జగన్ గెలుపుకు కాపులందరూ కృషి చేశారని… ఇప్పుడు కాపులకు రిజర్వేషన్లు కల్పించి మరొక సారి కాపు జాతి తమరి విజయానికి ఉపయోగపడేలా చూసుకుంటే బాగుంటుదని అన్నారు. మరోవైపు కేంద్ర సామాజిక న్యాయం.. సాధికారత శాఖ సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్ ఇటీవల మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో కాపులకు రిజర్వేషన్లు ఆర్టికల్ 342 ఏ(3) ప్రకారం రిజర్వేషన్లు కల్పించొచ్చని చెప్పారు. ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్రాలకు కేంద్రం నుంచి అనుమతి అవసరం లేదని అన్నారు.