విజయవాడ – ప్రముఖ పారిశ్రామికవేత్త అదాని నుంచి లంచం తీసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల నేరుగా ఎసిబిని ఆశ్రయించారు.. విజయవాడలోని ఎసిబి కార్యాలయానికి వెళ్లిన ఆమె జగన్ పై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు… అదానీ కంపెనీ నుంచి రూ.1750 కోట్ల లంచం తీసుకున్న జగన్‌పై విచారణ చేయాలని నేడు అధికారులకు వినతిపత్రం అందజేశారు . అమెరికా దర్యాప్తు సంస్థలే జగన్ స్కామ్ గురించి బయటపెడితే.. చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు షర్మిల. టీడీపీ బోను నుంచి ఏసీబీని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు . అదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో రూ. 1750 కోట్ల మేర ముడుపులు అందుకున్నట్టు అమెరికా దర్యాప్తు సంస్థ చెప్తోందని తెలిపారు. అయితే జగన్ తన పేరు ఎక్కడైనా ఉందా తెలివిగా మాట్లాడుతున్నారు. 2021లో అప్పటి సీఎం అంటే జగన్ కాక మరెవరు..? అంటూ ఎదురు ప్రశ్నించారు..
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదానీ డీల్ పెద్ద కుంభకోణం అని ఆందోళన చేసిందని గుర్తు చేశారు.. పెద్ద ఎత్తున ముడుపులు అందాయని నేటి అర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశారన్నారు. దీనిపై ఆయన . కోర్టుకు సైతం వెళ్లారని, . మరి ఇప్పుడు మీరు అధికారంలో ఉండి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? ఎందుకు మౌనంగా ఉన్నారు ? అంటూ ప్రశ్నలు కురిపించారు షర్మిల ..
అదానీకి చంద్రబాబు భయపడుతున్నారా..? అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ ఒప్పందం రద్దులో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు..? అంటూ చంద్రబాబు ను ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు ఒప్పందాలను జగన్ చాలా తేలిగ్గా రద్దు చేశారని,. జగన్ ఒప్పందాలను చంద్రబాబు ఎందుకు రద్దు చేయడం లేదన్నారు.