Friday, November 22, 2024

Breaking : ఆదానీ దేశం, జగన్ ఏపీ పరువు తీసేశారు.. షర్మిల

హైద‌రాబాద్ : గౌతమ్ అదానీ దేశం పరువు, జగన్ ఏపీ పరువు తీసేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. “అమెరికా ఏజెన్సీలు గౌతమ్ అదానీ, మరికొందరిపై అభియోగాలు మోపాయన్నారు.

గౌతమ్ అదానీ భారత్ లో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారన్నారు. కొన్ని రాష్ట్రాల సీఎంలకు లంచాలు ఇచ్చినట్లు వెల్లడైందన్నారు. ఏపీ ఉన్నతాధికారికి రూ.1,750 కోట్లు లంచం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తం లంచం జగన్ కు ఇచ్చినట్లు స్పష్టంగా వెల్లడైంది” అని షర్మిల చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement