Thursday, January 16, 2025

Action – కోడి పందాల ప్రాంగ‌ణంలో జ‌న‌సేన జండాలు – పార్టీ నేత ముప్పా స‌స్పెండ్

తీవ్రంగా ప‌రిగ‌ణించిన ప‌వ‌న్ పార్టీ
పెన‌మ‌లూరు పార్టీ నేత ముప్పా స‌స్పెండ్
పార్టీ గీత దాటినందుకు వేటు వేశామ‌న్న క్ర‌మ శిక్ష‌ణ సంఘం

మంగ‌ళ‌గిరి – పార్టీ గీత దాటిన ఓ నేతపై జనసేన హైకమాండ్ చర్యలు తీసుకుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు వద్ద కోడిపందాలు నిర్వహించారు. అయితే, ఈ కోడిపందాల బరి వద్ద పెనమలూరు నియోజకవర్గ జనసేన నేత ముప్పా గోపాలకృష్ణ (రాజా) పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీన్ని పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిగణించింది.

దీంతో ముప్పా గోపాలకృష్ణను క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేస్తున్నట్టు నేడు ఓ ప్రకటన విడుదల చేసింది. కోడి పందాల బరుల వద్ద ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు ఏర్పాటు చేయడం జనసేన పార్టీ విధానాలకు, ప్రతిష్ఠకు భంగకరం. ఇందుకు బాధ్యులైన మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇకపై జనసేన పార్టీ కార్యక్రమాలతో మీకు ఎటువంటి అధికారిక సంబంధం లేదు అని ముప్పా గోపాలకృష్ణకు స్పష్టం చేశారు. ముప్పా గోపాలకృష్ణ పెనమలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement